CSK జట్టుకు షాక్.. టీ 20 వరల్డ్‌ కప్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. ఎవరతను..?

by  |
CSK జట్టుకు షాక్.. టీ 20 వరల్డ్‌ కప్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. ఎవరతను..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-టీ20 ప్రపంచ‌కప్ సీరిస్‌లకు మరో కీలక ఆటగాడు దూరం అయ్యాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్కే జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత మ్యాచ్‌ నుంచి సామ్ కర్రన్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నొప్పి తీవ్రం కావడంతో ఐపీఎల్‌ మిగతా మ్యాచులతో పాటు ఏకంగా టీ-20 ప్రపంచ కప్‌‌కు కూడా దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌ జట్టులో యువ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న కర్రన్ ఆ జట్టుకు దూరం కావడంతో ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సరైన సమయంలో బ్యాట్‌తో పాటు బంతితో రాణించగలిగిన ఈ ఆటగాడు ప్రపంచ‌కప్‌లో లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉంటే సామ్ స్థానంలో సోదరుడు టామ్ కర్రన్‌ను రీప్లే్స్ చేస్తూ ఇంగ్లాండ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పొట్టి ప్రపంచకప్‌లో అన్నకు బదులు తమ్ముడు అరంగేట్రం చేయనుండడం విశేషం.


Next Story

Most Viewed