‘నా భర్తను అనవసరంగా విలన్‌గా చూపిస్తున్నారు’

by  |
shakib-al-hassan 1
X

దిశ, స్పోర్ట్స్ : ఢాకా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నిర్వహించిన ఒక మ్యాచ్‌లో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ఫీల్డ్ అంపైర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఒక సారి కాలితో వికెట్లను తన్నగా.. మరోసారి మూడు వికెట్లు కూడా పీకేసి విసిరికొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతే కాకుండా బంగ్లాదేశ్ మీడియాలో కూడా షకీబుల్ హసన్ చేసిన పనికి తీవ్ర వ్యతిరేకంగా వార్తలు ప్రసారం అయ్యాయి. షకీబుల్ హసన్ కూడా తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పాడు. తాజాగా షకీబుల్ భార్య ఉమ్మే అల్ హసన్ సోషల్ మీడియాలో ొక పోస్టు పెట్టారు. ‘నా భర్త చేసిన పనిపై టీవీల్లో నిరంతరాయంగా వార్తలు ప్రసారం అవుతున్నాయి.

అసలు జరిగిన విషయం ఏమిటో అర్దం చేసుకొని కొంత మంది అభిమానులు అండగా నిలిచారు. కానీ, మీడియా మాత్రం అసలు విషయాన్ని వదిలేసిన షకీబుల్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలనే పదే పదే చూపిస్తున్నారు. మ్యాచ్ మొత్తం గమనిస్తే అంపైర్ తప్పుడు నిర్ణయాలు అందరికఅ అర్దం అవుతాయి. కానీ అసలు విషయాన్ని వదిలేసిన తన భర్తను విలన్‌గా చూపిస్తున్నారు.’ అని ఉమ్మే ఆ పోస్టులో ఆవేదన వ్యక్తం చేసింది. తొలి సారి ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ను నిరాకరించినందుకు వికెట్లను తన్నాడు. మరో రెండు ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను వర్షం కారణంగా నిలిపివేస్తున్నామని అంపైర్ ప్రకటించిన వెంటనే మూడు వికెట్లు తీసి నేలకోసి కొట్టాడు.

Next Story