రాజు ఎలా చనిపోయాడంటే.. ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఇదే..!

946

దిశ, వెబ్ డెస్క్: సైదాబాద్ హత్యచార నిందితుడు రాజు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు అతడు ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో వివరించారు. గురువారం ఉదయం రైల్వే కీమాన్లు కుమార్, సారంగపాణికి చిన్న పెండ్యాల గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. వాళ్లు అతడి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. చెట్ల పొదల్లోకి పారిపోయాడు. కొద్దిసేపు చెట్లమధ్యనే  దాకొన్న రాజు ఆ తర్వాత కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 8.40 కి అతని చూశామని, ఆ తర్వాత అతను కనిపించకపోయేసరికి తాము డ్యూటీలో నిమగ్నమయ్యామని రైల్వే కీమాన్లు కుమార్, సారంగపాణి తెలిపారు.   కొద్దిసేపటికి 436 బ్రిడ్జి వద్ద మృతదేహం ఉన్నదని స్థానికులు సమాచారం ఇవ్వడంతో తాము వెళ్లి చూడగా.. అతడు మృతిచెందినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా..  వాళ్లు వచ్చి మృతుడు హత్యచారనిందితుడు రాజుగా గుర్తించారు అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

రాజు డెడ్‌బాడీపై డౌట్.. చిన్నారి పేరెంట్స్ ఏం అంటున్నారంటే..

పోలీసులే చంపారు.. ‘రాజు’ భార్య మౌనిక సంచలన వ్యాఖ్యలు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..