నా వికెట్ బౌలర్ మాత్రమే తీయగలడు : రుతురాజ్ గైక్వాడ్

by  |
నా వికెట్ బౌలర్ మాత్రమే తీయగలడు : రుతురాజ్ గైక్వాడ్
X

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మరాఠీ నటి సయాలీ సంజీవ్‌కు మధ్య ఏదో జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేసుకుంటూ… ఒకరినొకరు అభినందించుకోవడంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో ఉన్నదని అనుకుంటున్నారు. సయాలీ ఒక ఫొటో షేర్ చేయగా.. దీనికి రుతురాజ్ ‘వాహ్’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి సయాలీ హార్ట్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది.

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. సయాలీ అందానికి రుతురాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యారని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ రూమర్లపై రుతురాజ్ స్పందించాడు. ‘కేవలం బౌలర్లు మాత్రమే నా వికెట్ తీయగలరు.. వేరే ఎవరికీ అలాంటి ఛాన్స్ లేదు’ అని పోస్టు పెట్టి రూమర్లకు చెక్ పెట్టాడు. అయితే ఈ పోస్టును మరాఠీలో చేయడం విశేషం. ఇటీవల వాయిదా పడిన ఐపీఎల్ 2021లో చెన్నై తరపున రుతురాజ్ 196 పరుగులు చేశాడు. ఇక సయాలీ మరాఠీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నది.



Next Story