‘విజయ’పాల సేకరణ ధర రూపాయి పెంపు

454

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరను పెంచుతున్నట్టు సమాఖ్య చైర్మన్ ​లోకా భూమారెడ్డి ప్రకటించారు. మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రతి లీటరు‌పై రూపాయి పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ధర పెంచినట్టు తెలిపారు. ఇప్పటికే లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పెంచిన రూపాయి అందుకు అదనమని తెలిపారు. విజయ డెయిరీ నుంచి పాల బిల్లుల రూపంలో రైతులకు ఏటా రూ.12 కోట్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..