బస్టాండ్ వద్ద బస్సును ఢీకొన్న లారీ.. 16 మందికి గాయాలు

by Sridhar Babu |   (  Updated:2021-12-15 00:49:05  IST  )

<p>దిశ, సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా అందులో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సుల్తానాబాద్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు రాజీవ్ రహదారి పైకి వచ్చే క్రమంలో అతి వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీ కొట్టింది. మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంథని నుండి బయలుదేరి కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన ప్రయాణికులను [&hellip;]</p>

lorry-accident1
X

దిశ, సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా అందులో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సుల్తానాబాద్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు రాజీవ్ రహదారి పైకి వచ్చే క్రమంలో అతి వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీ కొట్టింది. మంథని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంథని నుండి బయలుదేరి కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన ప్రయాణికులను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం అంచున…

సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ రాజీవ్ రహదారి పక్కనే ఉంటుంది. బస్టాండ్ నుండి ఎగ్జిట్ అయ్యే దారి నుండి మెయిన్ రోడ్డు పై వచ్చే వాహనాలను గమనించే పరిస్థితి ఉండకపోవడంతోపాటు హైవే కావడంతో భారీ వాహనాలు వేగంగా వస్తుంటాయి. బస్టాండ్ ఎగ్జిట్ గేటు వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రమాదాలను నివారించేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

Next Story