వైరాలో రూ.67. 20 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత

by Ratna Kumari |   (  Updated:2026-02-24 09:16:23  IST  )

వైరాలోని ఐఎంఎల్ డిపో ఏదురుగా జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సుమారు రూ. 67.20 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు.

వైరాలో రూ.67. 20 లక్షలు   విలువ చేసే  గంజాయి పట్టివేత
X

దిశ, వైరా : వైరాలోని ఐఎంఎల్ డిపో ఏదురుగా జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సుమారు రూ. 67.20 లక్షలు విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు. 101.5 కిలోల ఎండు గంజాయి తో పాటు 2.7 కిలోల హషీష్ ఆయిల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ కమిషనర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ సిహెచ్ శ్రీహరిరావు, సిబ్బంది మంగళవారం వైరాలోని ఐఎంఎల్ డిపో ఏదురుగా జాతీయ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా హెచ్ ఆర్ 07 ఎన్ 6184 నెంబర్ గల మారుతి కారును అధికారులు పరిశీలించగా.. ఆ కారులో 101.5 కేజీల ఎండు గంజాయి తో పాటు 2.7 కేజీల హాషీష్ ఆయిల్ లభ్యమైంది. వీటి విలువ సుమారు రూ.67.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ కు చెందిన మహమ్మద్ అస్లామ్ ఒడిశా రాష్ట్రం కలిమెల నుంచి హైదరాబాద్ కు ఎండు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో తేలింది. పట్టుబడిన గంజాయి తో పాటు హాషీష్ ఆయిల్, గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న మారుతి కారును, రవాణా దారుడు మహమ్మద్ అస్లామ్ తో పాటు అతని సెల్ ఫోన్ ను వైరా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పగించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ జి. గణేష్ మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా సంబంధించిన సమాచారం తెలిసిన వారు 18004252523 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్ళు ఎంఏ కరీం, బాలు, కానిస్టేబుళ్ళు సుధీర్, వెంకట్, హరీష్, వీరబాబు, హనుమంతరావు, విజయ్, ఉపేందర్ పాల్గొన్నారు.

Next Story