- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > పెద్దపల్లిలో అడుగుబెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఏం మాట్లాడారంటే..?
పెద్దపల్లిలో అడుగుబెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఏం మాట్లాడారంటే..?
by Sridhar Babu |
<p>దిశ, పెద్దపల్లి : బహుజనులకు రాజ్యాధికారం రావాలన్నారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజనులు అందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనులకు సరైన న్యాయం చేయలేదని, బడుగు బలహీన వర్గాలు చైతన్య వంతులై బీఎస్పీ పార్టీని […]</p>

X
దిశ, పెద్దపల్లి : బహుజనులకు రాజ్యాధికారం రావాలన్నారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజనులు అందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో బీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుజనులకు సరైన న్యాయం చేయలేదని, బడుగు బలహీన వర్గాలు చైతన్య వంతులై బీఎస్పీ పార్టీని ఆదరించాలన్నారు. రానున్న ఎలక్షన్‌లో బీఎస్పీ ఏనుగు గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చూపిన బాటలో బీఎస్పీ పనిచేస్తుందని, బీఎస్పీని ఆదరించాలని కోరారు. ఆయన వెంట జిల్లా బీఎస్పీ నాయకులు తాండ్ర అంజి, తదితరులు పాల్గొన్నారు.

- Tags
- Bsp party
Next Story






