ప్రైవేటు టీచర్లకు రూ.15.15 కోట్లు మంజూరు

by  |
ప్రైవేటు టీచర్లకు రూ.15.15 కోట్లు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు టీచర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,24,704 మంది ప్రైవేటు టీచర్లు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో ప్రైవేటు టీచర్‌కు రూ.2000 ఆర్ఠికసాయం అందించేందుకు ఆర్థిక శాఖ రూ.15 కోట్ల 15లక్షలను మంజూరు చేసింది. ఈ నెల 21 నుంచి 25 వరకు ప్రతి టీచర్‌కు నెలకు 25 కిలోల సన్న బియ్యంతో పాటు రూ. 2000 నగదును అందించనున్నారు.

టీచర్లు ఎక్కడ రేషన్ బియ్యం తీసుకోవాలనే జాబితాను ప్రభుత్వం వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్టుగా అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,923 ప్రైవేటు పాఠశాలల్లో 1,12,048 మంది బోధనా సిబ్బంది, 12,636 మంది బోధనేతర సిబ్బంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డ్ ద్వారా రేషన్ బియ్యాన్ని అందించనున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించేంత ప్రభుత్వం ఈ సాయాన్ని అందించనుంది.


Next Story

Most Viewed