వచ్చే ఏడేళ్లలో 28 కొత్త బైకులు : రాయల్ ఎన్‌ఫీల్డ్

by  |
వచ్చే ఏడేళ్లలో 28 కొత్త బైకులు : రాయల్ ఎన్‌ఫీల్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విలాసవంతమైన మిడ్-సైజ్ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ రానున్న ఏడు సంవత్సాల్లో కనీసం 28 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. ప్రతి త్రైమాసికంలో ఒక కొత్త బైక్‌ను ప్రవేశపెట్టాలని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ స్థానన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో వినోద్ కె దాసరి ఆదివారం తెలిపారు.

రానున్న 12 నెలల్లో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ‘ప్రస్తుత తాము వచ్చే 5-7 ఏళ్లకు కావాల్సిన ఉత్పత్తి ప్రణాళికను సిద్ధం చేశాం. ఈ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది నుంచి ప్రతి త్రైమాసికానికి ఒక బైక్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎలాంటి వేరియంట్లలో వస్తుందనేది చెప్పలేనని, రానున్న ఏడేళ్లలో కనీసం 28 మోడళ్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని’ వినోద్ వెల్లడించారు.

రాబోయే కొత్త బైకులు మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో లభించనున్నాయి. 250 సిసి నుంచి 750 సిసి రేంజ్‌లో ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో వీటికి ఆదరణ లభిస్తాయన్నారు. అయితే, ఈ కొత్త ఉత్పత్తులపై పెట్టుబడుల గురించి ఆయన స్పందించలేదు. కొత్త ఉత్పత్తులు ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ సొల్యూషన్స్ వంటి కొత్త టెక్నాలజీపై ఆధారపడి వందల కోట్లతో ఉంటుందని వినోద్ వ్యాఖ్యానించారు.

Next Story