- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగ ఓట్లు.. టీడీపీకి రోజా కౌంటర్
<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఒక్కరూపాయి కూడా డబ్బులు, మద్యం పంచకుండా సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు నిర్వహించారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. మెరుగైన పాలన, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనస్సులను జగన్ గెలిచారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు అంటూ ప్రతిపక్షాలు పెద్ద నాటకం ఆడాయని ఆరోపించారు. గత ఎన్నికలప్పుడు లేని దొంగ ఓట్లు ఇప్పుడు తిరుపతి ఎన్నికలప్పుడే ఎలా వచ్చాయని రోజా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కావాలని రోడ్లెక్కి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఒక్కరూపాయి కూడా డబ్బులు, మద్యం పంచకుండా సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు నిర్వహించారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. మెరుగైన పాలన, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనస్సులను జగన్ గెలిచారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు అంటూ ప్రతిపక్షాలు పెద్ద నాటకం ఆడాయని ఆరోపించారు.
గత ఎన్నికలప్పుడు లేని దొంగ ఓట్లు ఇప్పుడు తిరుపతి ఎన్నికలప్పుడే ఎలా వచ్చాయని రోజా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కావాలని రోడ్లెక్కి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఇలాంటి వాటి వల్ల తమ పార్టీ ప్రతిష్ట ఏ మాత్రం దిగజారదన్నారు.
Next Story






