ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ,ఆర్మూర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయిన ఘటన ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్ శివారులో చోటు చేసుకుంది, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సైదేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్ నుండి కరీంనగర్ వెళ్లే రోడ్ ఫ్లైఓవర్ డాబా సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమీపంలో బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా మరొక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో గోల్డ్ స్మిత్ లో పనిచేసే కిరణ్,వంశీలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Next Story