- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరగంటసేపు లారీ కింద నలిగిన యువకుడు
<p>దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. లోకల్ ట్రాన్స్ ఫోర్ట్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టణానికి చెందిన మైబు అనే యువకుడు లారీ కింద పడి నలిగిపోయాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పోస్టాఫీసు ముందర చోటుచేసుకుంది. లారీ వెనుక టైర్ లో యువకుడి ఎడమ కాలు పడి అరగంట పాటు నరకయాతన అనుభవించాడు. స్థానికంగా ఉన్న యువకులు స్పందించి లారీలో ఉన్న సామాగ్రిని దించి జాకీ, […]</p>

X
దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. లోకల్ ట్రాన్స్ ఫోర్ట్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టణానికి చెందిన మైబు అనే యువకుడు లారీ కింద పడి నలిగిపోయాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పోస్టాఫీసు ముందర చోటుచేసుకుంది. లారీ వెనుక టైర్ లో యువకుడి ఎడమ కాలు పడి అరగంట పాటు నరకయాతన అనుభవించాడు. స్థానికంగా ఉన్న యువకులు స్పందించి లారీలో ఉన్న సామాగ్రిని దించి జాకీ, జేసీబీ సాయంతో యువకుని బయటకి తీశారు. యువకుడి తలకు బలమైన గాయం కావడంతో అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






