బిగ్ బాస్‌లోకి ఆర్జీవీ ఎంట్రీ..

by  |
బిగ్ బాస్‌లోకి ఆర్జీవీ ఎంట్రీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : మ్యాటర్ ఏదైనా సరే ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చాడంటే వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే. మాటలతో మనిషిని కన్విన్స్ చేసి, తన ఆలోచనకు ఓటేయించుకోగల వర్మ.. ఎన్ని వివాదాలు సృష్టించినా చివరకు తనే రైట్ అని చెప్పించగలడు. అలాంటి ఆర్జీవీ ఇంటర్వ్యూ ద్వారా పాపులరైన అరియానా గ్లోరి.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయింది. తన బోల్డ్ స్టేట్‌మెంట్స్, బ్రాడ్‌మైండ్ థింకింగ్‌తో టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. ఈ క్రమంలోనే వర్మ తనకు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుండటం విశేషం. నిజానికి ఎవరినీ పట్టించుకోని ఆర్జీవీ..

అరియానాకు ఓటేసి విన్నర్‌‌గా నిలబెట్టాలని, బిగ్ బాస్ విన్నర్‌ అయ్యే అన్ని అర్హతలు తనలో ఉన్నాయని చెప్తుండటం కొంచెం షాకింగ్ గానే ఉంది. ఇక దీనిపై రెస్పాండ్ అయిన ఆర్జీవీ ఫ్యాన్స్.. ‘మీరు చెప్పారుగా ఫాలో అయిపోతాం’ అంటున్నారు. మరి ఆర్జీవీ సపోర్ట్ అరియానాకు కలిసొస్తుందా? వర్మ పోస్ట్‌లు ఆడియన్స్‌ను కన్విన్స్ చేయగలవా? చూడాలి మరి. మొత్తానికి ఒక యాంకర్‌కు సపోర్ట్ చేస్తూ వర్మ స్టేట్‌మెంట్ ఇవ్వడమే గొప్ప విషయం కాగా.. అరియానాతో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేశానని ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు ఆర్జీవీ.

https://twitter.com/RGVzoomin/status/1336580713202601988?s=20

Next Story

Most Viewed