- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొలి నిందితుడు.. వకీల్ సాబే
<p>దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్, కరోనాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రకటిస్తూ, విడుదల చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ. ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న ఆర్జీవీ.. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా, పబ్లిసిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడడు. సినిమా మీద ఏ అంచనాలు లేకున్నా.. ఒక్కసారిగా సినీ అభిమానులను తనవైపు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. ఈ మధ్య కాలంలో తాను తీసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా, ఫలితాలతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
లాక్‌డౌన్, కరోనాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రకటిస్తూ, విడుదల చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ. ప్రేక్షకుల పల్స్ తెలుసుకున్న ఆర్జీవీ.. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా, పబ్లిసిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడడు. సినిమా మీద ఏ అంచనాలు లేకున్నా.. ఒక్కసారిగా సినీ అభిమానులను తనవైపు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. ఈ మధ్య కాలంలో తాను తీసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా, ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు ఆర్జీవీ. ఆ క్రమంలోనే.. మెగా ఫ్యామిలీ, నారా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఇటీవలే ‘ఆర్జీవీ మిస్సింగ్’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. తాను మిస్ కావడానికి కారణం.. పవర్‌ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు అంటూ అనుమానితుల పేర్లను కూడా విడుదల చేసిన వర్మ. తాజాగా అక్యూస్డ్ నెంబర్ వన్ అంటూ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు అక్యూస్ట్ నెం. 2కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ. మరి అందులో ఎవరినో చూపెడతాడో వేచి చూడాలి.
This poster is of Accused no.1 in my kidnapping ..Will release Accused no.2 ‘s poster tmrw evng at 5 P M #RgvMissing pic.twitter.com/Yu4Wq9GaTB
— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2020






