‘ఆర్జీవీ దెయ్యం’కు భయపడిన హీరో రాజశేఖర్

by  |
‘ఆర్జీవీ దెయ్యం’కు భయపడిన హీరో రాజశేఖర్
X

దిశ, సినిమా: హర్రర్ సినిమాలను యూనిక్‌ స్టైల్‌లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ‘ఆర్జీవీ దెయ్యం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయిపోయాడు. రాజశేఖర్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఆర్జీవీ.. సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్ తండ్రిగా నటించిన రాజశేఖర్, రియల్ గెటప్‌(విత్ ఔట్ మేకప్)లో కనిపించారని తెలిపాడు. తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ కీలకపాత్రల్లో నటించిన సినిమా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 16న విడుదల కానున్నట్లు చెప్పాడు. హర్రర్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ‘ఆర్జీవీ దెయ్యం’ మూవీ ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుందని, చాలా ఎంజాయ్ చేస్తారని తెలిపాడు వర్మ. కాగా కొమ్మూరి ప్రేమ్‌సాగర్, జె సాయి కార్తీక్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రానికి డీఎస్ఆర్ సంగీతం సమకూర్చారు.

Next Story

Most Viewed