పవన్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదు.. ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌పై రేణు రియాక్షన్

by  |
పవన్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదు.. ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌పై రేణు రియాక్షన్
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్దమవవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డులను సృష్టిస్తుంది. ఇక ఈ ట్రైలర్ పై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ట్రైలర్ పై పవన్ మాజీ భార్య , నటి రేణు దేశాయ్ స్పందించారు. ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె ‘వకీల్ సాబ్’ ట్రైలర్ గురుంచి మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బావుంది.. లాయర్ గా పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా చేసారు. పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్ బావుంది .. పవన్ అంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ లుక్ లో కనిపించారు అని చెప్పారు. మరుముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుంది.. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది” అని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 9 న విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.



Next Story

Most Viewed