జియో న్యూ ప్రీపెయిడ్ ప్లాన్స్

by  |
జియో న్యూ ప్రీపెయిడ్ ప్లాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జియో తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్లను అనౌన్స్ చేసింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద ఈ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైమ్ అందిస్తోంది. ఒకవేళ ఈ నిమిషాలు అయిపోతే.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది.

రూ. 4999/- ప్రీపెయిడ్ ప్లాన్:

ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా పరిమితి లేకుండా 350 జీబీ అపరిమిత డేటాను అందిస్తోంది. నాన్ జియో మినిట్స్.. 12 వేల నిమిషాలతో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.

రూ. 2599/- ప్రీపెయిడ్ ప్లాన్ :

ఇది ఇయర్లీ ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్‌వర్క్‌లకు 12 వేల నిమిషాల టాక్ టైమ్. రోజుకు 2జీబీ డేటాతో పాటు 10 జీబీ డేటాను బోనస్‌‌గా అందిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు. అలాగే డిస్నీ + హాట్‌స్టార్‌ను సంవత్సరం వరకు ఫ్రీగా పొందొచ్చు.

రూ.2399/-తో చేసుకునే రీచార్జ్ కూడా.. ఇయర్లీ ప్లానే. ఇందులో కూడా సేమ్ 12 వేల నిమిషాల టాక్‌టైమ్. రోజుకు 2 జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు వస్తాయి. కానీ ఇందులో డిస్నీ హాట్‌స్టార్‌, 10 జీబీ డేటా రాదు. వీటితో పాటు రూ. 2121, రూ. 1299 ప్లాన్లు కూడా ఉన్నాయి.

Next Story

Most Viewed