చెట్టును ఢీకొట్టిన తుఫాన్ వాహనం, ఏడుగురికి తీవ్ర గాయాలు

by Shiva |
చెట్టును ఢీకొట్టిన తుఫాన్ వాహనం, ఏడుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, మాచారెడ్డి: అతివేగంతో తుఫాన్ వాహనం చెట్టును ఢీకొట్టగా ఏడుగురికి తీవ్ర గాయాలపై ఘటన కామారెడ్డి-సిరిసిల్ల రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి నుంచి వేములవాడ వైపు తుఫాన్ వాహనం వెళ్తుండగా.. మాచారెడ్డి మండలం ఘనపూర్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారంతా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

Next Story

Most Viewed