రామ్ ‘రెడ్’కు U/A సర్టిఫికెట్

by  |
రామ్ ‘రెడ్’కు U/A సర్టిఫికెట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఇస్మార్ట్ శంకర్’తో టాకీస్‌ల వద్ద పండుగ వాతావరణం తీసుకొచ్చిన టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. ఈ సంక్రాంతి పండుగకు ‘రెడ్’ మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘రెడ్’ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా.. మణిశర్మ మ్యూజిక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రంలో నాజ‌ర్ ప్రధానపాత్రలో కనిపించబోతున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ.. ఈ రోజే సెన్సార్ పూర్తైందని, U/A సర్టిఫికెట్ వచ్చిందని చెప్పారు. ‘దేవదాసు, మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇదేనని తెలిపారు. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో.. ఆ అంశాలన్నీ సినిమాలో ఉంటాయని హామీనిచ్చారు. ‘ఇస్మార్ట్ శంకర్’కు సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ.. ‘రెడ్’కు కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని థియేటర్స్‌లోను ‘రెడ్’ ట్రైలర్ ప్రదర్శితమవుతుండగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా, ఈ ‘రెడ్’ సినిమా 2019‌లో తమిళ్‌లో అరుణ్ విజయ్ హీరోగా వచ్చిన ‘థడమ్’ మూవీకి రీమేక్.



Next Story

Most Viewed