- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా పరిస్థితికి ఇదే కారణమా?
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మరణాల్లో చైనా, ఇటలీ దేశాలను అగ్రరాజ్యం అమెరికా దాటేసింది. అక్కడ ఇంత తీవ్రంగా వ్యాధి ప్రబలడానికి కారణం వారు విమానాలను అనుమతించడమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీసు వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 వారు అమెరికా మీదుగా ప్రయాణిస్తున్న విమానాలను ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రపంచం మొత్తం మీద 4800 విమానాలు తిరుగుతుంటే వాటిలో మూడింట రెండు వంతులు అమెరికా మీదే తిరుగుతున్నాయి. సాధారణ సమయాల్లో దాదాపు 13వేలకు పైగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మరణాల్లో చైనా, ఇటలీ దేశాలను అగ్రరాజ్యం అమెరికా దాటేసింది. అక్కడ ఇంత తీవ్రంగా వ్యాధి ప్రబలడానికి కారణం వారు విమానాలను అనుమతించడమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీసు వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 వారు అమెరికా మీదుగా ప్రయాణిస్తున్న విమానాలను ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ప్రపంచం మొత్తం మీద 4800 విమానాలు తిరుగుతుంటే వాటిలో మూడింట రెండు వంతులు అమెరికా మీదే తిరుగుతున్నాయి. సాధారణ సమయాల్లో దాదాపు 13వేలకు పైగా విమానాలు తిరుగుతుండేవి. కానీ క్వారంటైన్ కారణంగా వాటి సంఖ్య దారుణంగా తగ్గిందని ఫ్లైట్‌రాడార్ పేర్కొంది. అయితే అమెరికా మీద ఇన్ని విమానాలు తిరుగుతుండటాన్ని నెటిజన్లు తప్పుబట్టారు. విమాన సేవల విషయంలో ఎలాంటి క్వారంటైన్ పాటించకపోవడం వల్లనే ఇలా మరణాలు పెరుగుతున్నాయని వారు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి విమాన సర్వీసులు అత్యవసర ఆహార పదార్థాలు, మెడిసిన్ కోసమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.






