తమిళ్, మలయాళంలోనూ రవితేజ ‘క్రాక్’

by  |
తమిళ్, మలయాళంలోనూ రవితేజ ‘క్రాక్’
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహరాజ రవితేజ చాలా కాలం తర్వాత ‘క్రాక్‌’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్‌ ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ అందుకోగా..బాక్సాఫీస్ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. కాగా, ‘క్రాక్’కు తెలుగు ప్రేక్షకుల నుంచి అందిన రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిల్మ్ మేకర్స్ సినిమాను తమిళ్, మలయాళంలోకి డబ్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన పని కూడా పూర్తి అయింది. ఫిబ్రవరి 5న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

మరో వైపు తెలుగులో సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన‘క్రాక్’ ఫిబ్రవరి 6న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో రిలీజ్ కాబోతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా వచ్చిన చిత్రంలో సముద్రఖని, చిరాగ్ జని, పి. రవి శంకర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధానపాత్రల్లో కనిపించారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్, జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేయగా ఠాగూర్ మధు నిర్మాత.


Next Story

Most Viewed