నవీన్ చంద్ర #BROకు రష్మిక సాయం

by  |
rashmika-mandanna
X

దిశ, సినిమా: ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్రతో పాటు అవికా గోర్, సంజన సారథి లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘#BRO’. అన్నా చెల్లెళ్ల మధ్య ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న చిత్రంలో అవికాగోర్‌.. నవీన్ చంద్రకు చెల్లెలిగా నటిస్తోంది. మ్యాంగో మాస్ మీడియా, జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందాన విడుదల చేసింది. తను బిజీగా ఉన్నప్పటికీ, అడిగిన వెంటనే #BRO చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు మూవీ టీమ్ తరఫున చిత్ర నిర్మాత జె.జె.ఆర్ రవిచంద్ రష్మికకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో మరిన్ని సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు. ఇక ఈ చిత్రానికి అజీమ్ మహ్మద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Naveen-Chandra



Next Story

Most Viewed