ఆ విషయంలో నన్ను నా పేరెంట్స్ కూడా నమ్మలేదు- రష్మిక

by Vadlamudi Anukaran |   (  Updated:2021-04-15 23:48:14  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషలోనూ నటిస్తూ టాప్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. &#8216;ఛలో&#8217; సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇటీవలే కోలీవుడ్ లో సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.. ఈ మధ్యనే హీరోయిన్లందరూ బాలీవుడ్ బాట [&hellip;]</p>

ఆ విషయంలో నన్ను నా పేరెంట్స్ కూడా నమ్మలేదు- రష్మిక
X

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషలోనూ నటిస్తూ టాప్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇటీవలే కోలీవుడ్ లో సుల్తాన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.. ఈ మధ్యనే హీరోయిన్లందరూ బాలీవుడ్ బాట పడుతున్న నేపథ్యంలో అమ్మడు కూడా తన లక్ ని పరీక్షించుకోవడానికి బీ టౌన్ లో అడుగుపెట్టడానికి సిద్దమవుతుంది. ఇప్పటీకే సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఈ అందాల భామ మరో బంపర్ ని పట్టేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బీ అమితాబ్ నటిస్తున్న చిత్రంలో రష్మిక ఛాన్స్ కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులకు కూడా తెలిపింది. వికాశ్‌ బల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ కూతురిగా రష్మిక కనిపించనుంది. అయితే ఈ ఆఫర్ గురుంచి రష్మిక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. తనకు చిన్నపాటి నుండి అమితాబ్ అంటే చాల ఇష్టమని, ఆయనతో కలిసి పనిచేస్తానని అసలు అనుకోలేదని తెలిపింది. అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెబితే తన పేరేంట్స్‌ తనను నమ్మలేదని, తన పేరెంట్స్ సైతం అమితాబ్ కి అభిమానులని తెలిపింది. మరి ఈ సినిమాతో అమ్మడు బాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.

Next Story