రషీద్ ఖాన్‌ది ఇల్లు కాదు ప్యాలెస్

by  |
రషీద్ ఖాన్‌ది ఇల్లు కాదు ప్యాలెస్
X

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ వాయిదా పడటంతో స్వదేశం ఆఫ్గనిస్తాన్‌కు చేరుకున్నాడు. తాజాగా తాను ఇంటిలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘హోం స్వీట్ హోం’ అని క్యాప్షన్ పెట్టి తన ఇంటిలో దిగిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక పెద్ద ప్యాలెస్‌లా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి అభిమానులే కాకుండా క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోయారు.

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్ రషీద్ ఇంటి ఫొటోని చూసి అవాక్కయ్యింది. వాటే ప్యాలెస్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇక సన్‌రైజర్స్ జట్టులోని సహజర ఆటగాడు ఖలీల్ అహ్మద్ కూడా మాషా అల్లా అంటూ రిప్లై చేశాడు. టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అయితే ఇంకా మీ ఇంటి ఫొటోలు పెట్టు అంటూ ఆసక్తికరంగా అడిగాడు. ఆ ఫొటోతో పాటు రషీద్ అందరినీ ఇంటిలోనే సురక్షితంగా ఉండాలని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని రషీద్ కోరాడు.


Next Story