'మహా సముద్రం'లో రాశీ?

by  |
మహా సముద్రంలో రాశీ?
X

‘ఆర్ఎక్స్ 100’ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజై పెద్ద హిట్ అందుకుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ సినిమా ఇదే కాగా హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌కు మంచి లైఫ్ ఇచ్చింది సినిమా. అయితే ఈ సినిమా తర్వాత ‘మహా సముద్రం’ టైటిల్‌తో సినిమా తీయాలనుకున్నాడు అజయ్. ఇది మల్టీస్టారర్ మూవీ కాగా, హీరోల కోసం వెతుకులాటలో చాలా మంది కథానాయకులకు స్టోరీ వినిపించాడు. చివరగా శర్వానంద్ సినిమా ఓకే చేసినట్లు తెలియగా.. మరొక హీరో ఎవరన్నది ఇంకా క్వశ్చన్ మార్క్.

అయితే శర్వాకు జోడీగా మాత్రం ముద్దుగుమ్మ రాశీ ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘వెంకీమామ, ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న రాశీ.. తర్వాత విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో డిజాస్టర్ చవిచూసింది. వరల్డ్ ఫేమస్ లవర్‌లో లీడ్ రోల్‌లో కనిపించిన రాశీ.. ఒక వేళ సినిమా హిట్ అయితే భారీగా ఫేమస్ అయ్యేది. కానీ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక నిరాశనే మిగిల్చింది. అయితే మహాసముద్రం స్టోరీ విన్న రాశీ.. విజయ్ సినిమా డిజాస్టర్ ఇచ్చినా.. శర్వాతో కలిసి మరో హిట్ అందుకుంటాననే ధీమాతో ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed