ఆ ఎన్నికలపై బాంబు పేల్చిన వర్మ.. అలా అయితే సినిమా తీసేవాడిని

by  |

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ మా ఎన్నికలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. ఓ ప్యానెల్ సభ్యులు మరో ప్యానెల్ సభ్యులపై దాడి చేయడం ఇలా మా ఎన్నికలు ఓ చరిత్ర తిరగరాసాయని చెప్పాలి. ఇక ఈ ఎన్నికలపై పలువురు నటీనటులు పలు రకాలుగా కామెంట్ చేశారు. ఈనేపథ్యంలో వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వూలో మా ఎన్నికల గురించి సంచలన కామెంట్స్ చేశారు. మా అసోసియేషన్ అనేదే ఓ నాన్సెన్స్ వ్యవహారంగా పేర్కొన్న వర్మ.. ఆ ఎన్నికల కోసం కన్నీళ్లు పెట్టుకోవడం.. భుజాలు కొరుక్కోవడం అనేది పెద్ద డ్రామాలన్నారు. ఎన్నికలు ఓ సర్కస్ అయితే.. అందులో పాల్గొన్న వారంతా జోకర్లని సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాకుండా కనీసం రెండు మర్డర్లు జరిగేతే మా ఎన్నికలను సినిమా తీసేవాడినని, కానీ ఈ భుజాలు కొరుక్కోవడం ఏంటో అంటూ తన స్టైల్‌లో స్పందిస్తూ.. కామెంట్ చేశారు. ఇక మా ఎన్నికలు ముగిసినా.. మాలో మాత్రం మాటలదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మాటల దాడులపై కూడా వర్మ మళ్లీ ఏమైనా స్పందిస్తారో వేచి చూడాలి.

Next Story