సమ్మర్‌లో రానా ‘అరణ్య’..

by  |
సమ్మర్‌లో రానా ‘అరణ్య’..
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ‘అరణ్య’ సినిమా గురించి మూవీ యూనిట్ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చి్ంది. బిగ్‌ నోట్‌తో న్యూ ఇయర్‌కు వెల్ కమ్ చెప్పిన యూనిట్.. మార్చి 26న థియేటర్స్‌లోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ రిలీజ్ కానున్న ఈ మూవీలో విష్ణు విశాల్ కీలక పాత్రలో కనిపించబోతుండగా.. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాను ఎరోస్ మోషన్ పిక్చర్స్ నిర్మించింది. తెలుగులో ‘అరణ్య’గా వస్తున్న సినిమా.. హిందీలో ‘హాథీ మేరె సాథి’, తమిళ్‌లో ‘కాదన్‌’ పేరుతో రిలీజ్ కానుంది. పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గా ఓంకార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాకు శంతను మొయిత్ర సంగీతం సమకూర్చారు.

Next Story

Most Viewed