ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై ఆర్‌జీ‌వీ సంచలన కామెంట్

by  |
RGV
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు అరెస్ట్ నేపథ్యంలో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ మేరకు ఆర్యన్‌కు షారుఖ్ కూడా చేయలేని సహాయం ఎన్‌సీబీ చేసిందని వర్మ వరుస ట్వీట్లు చేశాడు. ‘షారుఖ్ లాంటి తండ్రి ఉండడం వల్ల ఆర్యన్ సూపర్ స్టార్‌ మాత్రమే అయ్యాడు. కానీ, ఎన్‌సీబీ అతడిని సూపర్ డూపర్ స్టార్‌ను చేసింది. షారుఖ్ అభిమానులందరూ ఎన్‌సీబీకి ధన్యవాదాలు చెప్పాలి. షారుఖ్ కు నిజమైన అభిమానిని అయిన నేను ‘జై ఎన్‌సీబీ’ అని అరవాలనుకుంటున్నాను’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అలాగే ‘ఆర్యన్ తన తండ్రి షారుఖ్ దగ్గరకంటే జైలు జీవితంలో ఎన్‌సీబీ నుంచే ఎన్నో అద్భుత విషయాలు నేర్చుకున్నానని భవిష్యత్తులో చెబుతాడని నా విశ్వాసం. షారుఖ్ కంటే ముందే ఎన్‌సీబీ, మీడియా ఆర్యన్‌కు బిగ్ లాంచ్ ఇచ్చాయి’ అని ఆర్‌జీ‌వీ వివరించాడు. అలాగే బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా షారుఖ్ కు మద్దతుగా నిలుస్తూ ఆర్యన్‌కు అంతా మంచే జరుగుతుందని ట్వీట్లు చేస్తున్నారు.

RGV1


Next Story

Most Viewed