ఇండస్ట్రీలో రకుల్ హవా

by  |
ఇండస్ట్రీలో రకుల్ హవా
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల తార రకుల్‌ కెరీర్ జెడ్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఓ సినిమాను పూర్తి చేసిన రకుల్ త్వరలోనే బాలీవుడ్ సినిమా ‘మేడే’ షూటింగ్‌లో పాల్గొననుంది. ఆ మూవీ షూటింగ్ ప్రారంభమవడానికి కాస్త టైమ్ ఉండటంతో, ఈ భామ తన ఫ్యామిలీతో కలిసి ‘మాల్దీవ్స్’లో చిల్ అవ్వడానికి వెళ్లింది. అందాల ప్రకృతిని ఆస్వాదిస్తూ, నీలి సాగరమే ఆచ్చెరువొందెట్లు తన మాల్దీవుల వెకేషన్స్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తూనే అభిమానులకు తను నటించబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్ వివరాలు కన్ఫార్మ్ చేసి శుభవార్త అందించింది.

రకుల్ నటించే చిత్రాలపై కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాంతో వాటికి చెక్ చెప్పడానికి రకుల్ మేనేజర్ ఆమె అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు అధికారికంగా అనౌన్స్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ‘చెక్’ సినిమాలో అడ్వకేట్‌గా రకుల్ కనిపించబోతుంది. ఇందులో నితిన్ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. తమిళంలో శివ కార్తికేయన్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. బాలీవుడ్‌లో జాన్ అబ్రహంతో కలిసి ‘అటాక్’ అనే చిత్రంతోపాటు, అర్జున్ కపూర్‌తో మరో సినిమా చేయనుంది. ఇక అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్‌ చిత్రం ‘మేడే’ లోనూ ఆమె హీరోయిన్‌గా చేస్తుంది. ఇక క్రిష్, వైష్ణవ్ తేజ్ కలయికలో వస్తున్న సినిమా అల్రెడీ షూటింగ్ ముగించుకుంది. రకుల్ రాబోయే సంవత్సరం కాలం పాటు తీరికలేని షూటింగ్స్‌తో బిజీబిజీగా గడపబోతున్నట్లు ఈ ప్రాజెక్ట్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక రకుల్ ఫ్యాన్స్‌కు 2021 పండగే అన్నమాట.


Next Story

Most Viewed