టాలీవుడ్‌లో రాజ్‌తరుణ్ ‘పవర్ ప్లే’

29

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేసి టీమ్ అంద‌రికీ విషెస్ తెలిపారు.