‘గతం’ డైరెక్టర్‌తో గరుడవేగ హీరో!

by  |
‘గతం’ డైరెక్టర్‌తో గరుడవేగ హీరో!
X

దిశ, సినిమా: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ స్పీడు పెంచారు. తాను నటించబోయే చిత్రాల వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇటీవలే పుట్టినరోజు సందర్భంగా తన 91వ సినిమా ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ‘శేఖర్ – మ్యాన్ విత్ ద స్కార్’ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో రాజశేఖర్ ఓల్డేజ్ లుక్.. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా తన 92వ సినిమా గురించి ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ఇండియన్ పనోరమ కేటగిరీ నందు ప్రదర్శితమైన ఏకైక తెలుగు సినిమా ‘గతం’ డైరెక్టర్ కిరణ్ కొండమడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

ఈ మేరకు చిత్ర యూనిట్ ‘RS92’ థీమ్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ఇంగ్లిష్ న్యూస్ పేపర్‌పై మందుగ్లాసుతో పాటు కనిపిస్తున్న స్పెక్టాకల్స్-గన్-బుల్లెట్స్-సిగరెట్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే రాజశేఖర్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని స్పష్టమవుతుండగా, ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుందని తెలుస్తోంది. ఆఫ్ బీట్ ఫిలిమ్స్-ఎస్ ఒరిజినల్స్-పెగాసస్ సినీ కార్పొరేషన్ బ్యానర్స్‌పై శివాణి-శివాత్మిక-సృజన్-భార్గవ-హర్ష సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా 2021లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Next Story

Most Viewed