తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

by  |
తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిచాయని దీంతో ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు.

ఈ ద్రోణి ప్రభావంతో రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రం అంతటా ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఉత్తర, తూర్పు జిల్లాలలో ఎక్కువగా కనిపించనుందని అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు 12,13 తేదీలలో కురుస్తాయన్నారు. అలాగే మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ద్రోణితో రాగల 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఒడిశా మీదుగా వెళ్లే అవ‌కాశం ఉంది. దీంతో ప‌శ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీచ‌నున్నాయని, దీని కారణంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed