రైల్వే బోగిలే.. కరోనా ఐసోలేషన్ వార్డులు

by  |
రైల్వే బోగిలే.. కరోనా ఐసోలేషన్ వార్డులు
X

దిశ వెబ్ డెస్క్ :

దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరగుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడానికి అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. రెండో దశలో ఉన్న కరోనా.. మూడో దశకు చేరుకుంటే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక వేళ కరోనా కేసులు పెరిగితే.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రని కరోనా ఆసుపత్రిగా మార్చేశారు. గచ్చిబౌలి స్టేడియాన్ని, ప్రకృతి చికిత్సాలయాన్ని కరోనా సేవలకు ఉపయోగించుకుంటుంది. దాదాపు 60 వేల కరోనా బాధితులు ఉన్న వైద్య సేవలు అందిస్తామని స్వయంగా రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సైతం ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తోంది. రైలు కోచ్‌లనే ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు. ఐసోలేషన్ క్యాబిన్ తయారుచేయడానికి ఒకవైపు మిడిల్ బెర్త్ తొలగించారు. అలాగే, దానికి ఎదురుగా ఉండే మూడు బెర్తులు, అప్పర్ బెర్తులు ఎక్కేందుకు ఉన్న నిచ్చెనలు కూడా తొలగించారు.

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలపై వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు ప్రభుత్వం అప్రమత్తమయ్యింది
మరోవైపు, వైరస్‌ను కట్టడిచేయడానికి విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైరస్‌ను నియంత్రించి, మరో దశలోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపట్డారు. అలాగే, ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని కేంద్రం అలర్ట్
చేసింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా రద్దు చేసిన 13 వేల ప్యాసింజర్ రైళ్లను ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకుంటోంది. రైళ్లలో ఉండే బోగీలను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చే విధానంపై … సాధ్యాసాధ్యాలను పరిశీలించిన భారతీయ రైల్వే … వెంటనే ఆ ఆలోచనకు పచ్చజెండా ఊపింది.

3 లక్షల బెడ్స్ సిద్ధం చేస్తున్న కేంద్రం :

రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులు, ఐసీయులుగా ఇవ్వాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా ఇందుకు సంబంధించిన ప్రోటో టైప్ కోచ్ లను సిద్ధం చేసింది. ఈ నిర్ణయం వల్ల సరైన వైద్య సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కూడా వైద్యసదుపాయలను అందించే అవకాశాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల మొత్తం 3 లక్షల బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. అలాగే రైళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు ఉపయోగించే అంబులెన్సులను కూడా ప్రభుత్వానికి అందించవచ్చు.

కోచ్లో ఐసోలేషన్ కేంద్రాలు ఇలా :

బాత్‌రూమ్‌లు, కోచ్ లోపలకు వెళ్లే మార్గం సహా ఇతరత్రా వాటిలో మార్పులు చేసిన ఐసోలేషన్ కోచ్ సిద్ధం చేస్తున్నారు. ఒక్కో కోచ్‌లో 10 వార్డులు ఉండేటా ఏర్పాట్లు చేశామని రైల్వే శాఖ తెలిపింది. ఐసోలేషన్‌లో ఉండేవారి వస్తువుల కోసం అల్మరాలను ఏర్పాటుచేశామని, రోజూ ఈ కోచ్‌లను శుభ్రం చేస్తున్నట్టు తెలిపింది.

– ప్రతి కోచ్ లో రెండు మరుగుదొడ్లను బాత్ రూమ్ లుగా మార్చారు.
– ప్రతి బాత్ రూమ్ లో చేతులు కడుక్కునేందుకు ఒక హ్యండ్ షవర్. ఒక బకెట్ ఉంచారు.
– ప్రతి భోగికి ప్రత్యేకమైన పరదాలు
– ప్రతి కోచ్ లో పది ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. క

– వైద్య పరికరాలను నడపడానికి కంపార్ట్ మెంట్లో 220 వోల్టుల విద్యుత్ కనెక్షన్.
– ప్రతి భోగిని నిత్యం శానిటైజేషన్ చేస్తున్నారు.
– కరోనా బాధితుల సామాగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాలు.

నిజమైన అమితాబ్ ట్వీట్ :

దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్డౌన్ మధ్య పౌరుల కోసం అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేకమైన సూచనను అందించారు. ఖాళీ రైలు కోచ్‌ లను ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించవచ్చనే ఆలోచనను పంచుకున్నారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా రైళ్లు నడవడం లేదు. ఈ ఆలోచనను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఎవరో పంచుకున్నారని ఆయన తెలిపారు. అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో ఫార్వార్డ్ చేసిన కామెంట్ ను ఇలా పంచుకున్నారు .
“ఈ ఆలోచనను ప్రభుత్వ అధికారులందరికీ పంపాలి. అన్ని రైలు సర్వీసులు ఎలాగో నిలిచిపోయాయి. రైలు భోగీలు పనిలేకుండా ఉన్నాయి. ప్రతిదానికి 20 గదులు ఉంటాయి. భారతదేశం అంతటా 13000 రైళ్లు ఉన్నాయి. ఏ సందర్భంలోనైనా ఆస్పత్రులు లేని పక్షంలో ఇవే మంచిది’’

పెరిగిన కరోనా కేసులు :

శనివారం ఉదయానికి దేశవ్యాప్తంగా 873 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్‌-19 కారణంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 19మంది మృతి చెందినట్లు తెలిపింది. అలాగే, వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో 79 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని పేర్కొంది. ప్రస్తుతం 775 మంది చికిత్స పొందుతున్నారని, ఈ మహమ్మారి దాదాపు అన్ని రాష్ట్రాలకు విస్తరించిందని వ్యాఖ్యానించింది

Tags: corona virus, isolation, indian railway, icu, covid 19 , coach, cabin, rail

Next Story

Most Viewed