ప్రధానిపై రాహుల్ కరోనా ట్వీట్ వైరల్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-21 06:14:08  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పుడు ట్విట్టర్ వార్ నడుస్తోంది. కరోనా సమయంలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు ఇవేనంటూ రాహుల్ గాంధీ సెటైరికల్‌గా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ వైఫల్యం వల్లే కరోనాలో దేశం స్వయం సంవృద్ధి సాధించిందని రాహుల్ దుయ్యబట్టారు. ‘‘కరోనా వైరస్‌ విజృంభణ వేళ మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు.. ఫిబ్రవరి- హలో ట్రంప్‌, మార్చి- మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూల్చివేత, [&hellip;]</p>

ప్రధానిపై రాహుల్ కరోనా ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పుడు ట్విట్టర్ వార్ నడుస్తోంది. కరోనా సమయంలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు ఇవేనంటూ రాహుల్ గాంధీ సెటైరికల్‌గా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ వైఫల్యం వల్లే కరోనాలో దేశం స్వయం సంవృద్ధి సాధించిందని రాహుల్ దుయ్యబట్టారు.

‘‘కరోనా వైరస్‌ విజృంభణ వేళ మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు.. ఫిబ్రవరి- హలో ట్రంప్‌, మార్చి- మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కూల్చివేత, ఏప్రిల్‌- కరోనాపై కట్టడికి కొవ్వొత్తుల్ని వెలిగించడం, మే- మోదీ సర్కార్‌కు ఆరో వార్షికోత్సవం, జూన్‌- బీహార్‌లో వర్చువల్‌ ర్యాలీ, జులై- రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర.. ఇలాంటి చర్యలతోనే కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) సాధించింది’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ ట్వీట్‌‌కు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందంటూ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ హింసాత్మక ఘటనలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోల్పోవడం, చైనాకు వంత పాడడం, రాజస్థాన్‌ను నాశనం చేయడం.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

Next Story