కరీనాను చూస్తే వణుకు వచ్చేది : రాధిక మదన్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: రాధిక మదన్.. విశాల్ భరద్వాజ్ &#8216;పటాకా&#8217; మూవీతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం &#8216;ఆంగ్రేజీ మీడియం&#8217; సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా ప్రధాన పాత్రలో కనిపించబోతున్న భామ.. తన ఫ్యాన్ గర్ల్ మూమెంట్ షేర్ చేసింది. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్‌కు బిగ్ ఫ్యాన్ అయిన రాధిక మదన్.. చిన్నప్పటి నుంచి తన సినిమాలే చూస్తూ పెరిగానని తెలిపింది. ఇప్పటికీ &#8216;తషాన్&#8217; పోస్టర్ తన మొబైల్‌లో వాల్ పేపర్‌గా ఉందన్న రాధిక మదన్.. &#8216;ఆంగ్రేజీ [&hellip;]</p>

కరీనాను చూస్తే వణుకు వచ్చేది : రాధిక మదన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాధిక మదన్.. విశాల్ భరద్వాజ్ ‘పటాకా’ మూవీతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం ‘ఆంగ్రేజీ మీడియం’ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా ప్రధాన పాత్రలో కనిపించబోతున్న భామ.. తన ఫ్యాన్ గర్ల్ మూమెంట్ షేర్ చేసింది. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్‌కు బిగ్ ఫ్యాన్ అయిన రాధిక మదన్.. చిన్నప్పటి నుంచి తన సినిమాలే చూస్తూ పెరిగానని తెలిపింది. ఇప్పటికీ ‘తషాన్’ పోస్టర్ తన మొబైల్‌లో వాల్ పేపర్‌గా ఉందన్న రాధిక మదన్.. ‘ఆంగ్రేజీ మీడియం’ షూటింగ్ టైంలో కరీనాను చూస్తే వణుకు వచ్చేసిందని తెలిపింది. తనను తొలిసారి మాత్రమే కాదు ఎప్పుడు చూసినా ఇదే ఫీలింగ్ కలిగిందని చెప్పింది. కానీ కరీనా మాత్రం చాలా ప్రేమగా చూసుకునేదని… స్టార్ హీరోయిన్‌లా బిహేవ్ చేయకుండా చాలా సాధారణంగా, గౌరవంగా మాట్లాడేదని తెలిపింది. కాగా సినిమాలో కరీనా పోలీస్ ఆఫీసర్‌ నయనగా కనిపించనున్నారు. పాత్ర నిడివి చిన్నదే అయినా సినిమాకు కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

Tags: Kareena Kapoor Khan, Kareena Kapoor, Radhika Madan, Fan Girl Moment, Angrezi Medium

Next Story