ఊదా రంగులో ఎలిజబెత్ రాణి చేతులు.. ఆందోళనలో అభిమానులు

by  |
eLIJEBITH
X

దిశ, ఫీచర్స్: యునైటెడ్ కింగ్‌డమ్ రాయల్ క్వీన్ ఎలిజబెత్.. అనారోగ్యం కారణంగా రాచరిక విధులు, కార్యక్రమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్‌ను కలుసుకోగా, ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు ఫొటోల్లో రాణి చేతులు పర్పుల్ కలర్‌లో కనిపించడం వీక్షకులను ఆందోళనకు గురిచేసింది.

బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన చిత్రాల్లో క్వీన్ ఎలిజబెత్ చేతులు ముదురు ఊదా రంగులో కనిపించాయి. గదిలోని లైటింగ్‌ కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. కానీ బాడీలో రక్త ప్రసరణ తగ్గినపుడు ఏర్పడే రేనాడ్ ప్రభావానికి ఇది సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. UK నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం జలుబు, ఒత్తిడి లేదా భావోద్వేగ కలతల కారణంగా రేనాడ్ సంభవించవచ్చు. ఇది తీవ్రమైన సమస్యలను కలిగించదని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది. ఇలాంటి పరిస్థితి మీకు కలిగినా లేదా ఇతరత్రా సందేహాలుంటే వెంటనే దగ్గరలోని డాక్టర్ లేదా అర్హత కలిగిన ఇతర ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది.

వాతావరణ పరిస్థితులు చల్లగా ఉన్నప్పుడు కేశనాళికలు, సిరల్లో రక్తనాళాల సంకోచం సంభవించి శరీరం ఊదా రంగులోకి మారే అవకాశం ఉంది. ఇది గుండెలో షంట్‌‌కు కారణమయ్యే వ్యాధికారకం కూడా. రక్తసరఫరా లేకపోవడం ఆందోళనకు కారణం కాగా ఈ పరిస్థితి పెరిఫెరల్ సైనోసిస్ వల్ల ఏర్పడుతుంది. వృద్ధాప్యంలో కేశనాళికల్లో రక్త సరఫరా లేకపోవడం వల్ల ఇలా జరిగే చాన్స్ ఉండగా.. చిన్న వయస్సులోనూ సంభవించవచ్చు.
– డాక్టర్ సామ్రాట్ షా, భాటియా హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్నిస్ట్


Next Story

Most Viewed