BREAKING: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం!

by Disha Web Desk 9 |
BREAKING: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల వేళ వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అనేకమంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాబోయే ప్రభుత్వంలో మళ్లీ అవకాశం ఉంటుందో లేదో అని టెన్షన్‌లో మరికొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు రాజీనామాలు చేయొద్దని వాలంటీలర్లకు సూచిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో జీతాలు పెంచుతామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా అంగన్వాడీలను, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఓపీఓలుగా తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును కూడా మే 1 వ తేదీ వరకు పొడిగించింది.



Next Story