Bank loan offers :పంజాబ్ బ్యాంక్ ఆఫర్ల మేళా..

by  |
pnb
X

దిశ వెబ్ డెస్క్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. రానున్న పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామంటోంది. దానికి తోడు కొత్తగా ఖాతాదారులు పెంచుకోవడానికి సర్వీస్ చార్జీలను, ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది. ఇక యువతను, మద్యతరగతి వాళ్లను ఆకట్టుకోవడానికి గృహ రుణాలు, కార్ లోన్ లను తక్కువ వడ్డీకే అందించేందుకు ముందుకు వచ్చింది. డాక్యూమెంటేషన్ చార్జీలు కూడా ఉండవని ప్రకటించింది. ప్లానెట్ లోన్, వెహికల్ లోన్, మై ప్రాపర్టీ లోన్, గోల్డ్ లోన్ వంటి వాటికి చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోం లోన్స్ పై 6.8 శాతం నుంచి వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. ఇక కారు రుణాల 7.15 నుంచి మెదలవుతాయి. పర్సనల్ లోన్స్ తీసుకోవాలని అనుకునే వారికి వడ్డీ రేటు 8.95 నుంచి ప్రారంభం అవుతోంది.

PNB Waives Service Charge, Processing Fee On Retail Products

Next Story

Most Viewed