భ‌ద్రాద్రి ఆల‌యంలో భ‌క్తుల సంద‌డి

by Sridhar Babu |

<p>దిశ‌, ఖ‌మ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం సీతారాముల ఆలయంలో చాలా రోజుల తర్వాత భక్తుల సందడి నెలకొంది. దాదాపు 80 రోజుల త‌ర్వాత సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మూసివేసిన విషయం విదితమే. ఈ నేప‌థ్యంలోనే రాముల వారి ఆల‌యంలోకి భ‌క్త‌లు ఎవ‌రినీ అనుమ‌తించ‌కూడా నిత్య పూజ‌ల‌ను ఆల‌య అర్చ‌క‌, సిబ్బంది కొన‌సాగిస్తూ వ‌చ్చారు. ఈ సంవ‌త్స‌రం సీతారాముల క‌ల్యాణం [&hellip;]</p>

భ‌ద్రాద్రి ఆల‌యంలో భ‌క్తుల సంద‌డి
X

దిశ‌, ఖ‌మ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం సీతారాముల ఆలయంలో చాలా రోజుల తర్వాత భక్తుల సందడి నెలకొంది. దాదాపు 80 రోజుల త‌ర్వాత సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మూసివేసిన విషయం విదితమే. ఈ నేప‌థ్యంలోనే రాముల వారి ఆల‌యంలోకి భ‌క్త‌లు ఎవ‌రినీ అనుమ‌తించ‌కూడా నిత్య పూజ‌ల‌ను ఆల‌య అర్చ‌క‌, సిబ్బంది కొన‌సాగిస్తూ వ‌చ్చారు. ఈ సంవ‌త్స‌రం సీతారాముల క‌ల్యాణం కూడా అతికొద్దిమంది ఆల‌య సిబ్బంది, ప్ర‌భుత్వం పెద్దల స‌మక్షంలో నిరాడ‌ంబ‌రంగా జరిపించారు. ఎట్టకేలకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో సోమ‌వారం భద్రాద్రి ఆల‌యంలోకి భ‌క్తుల‌ను అనుమతించారు.సీతారాములను దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించేలా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మొద‌టి రోజు స్థానికులు మాత్రమే ఎక్కువ‌ సంఖ్యలో కోదండరామున్ని ద‌ర్శించుకున్నట్టు తెలుస్తోంది.

Next Story