షూటింగ్ రీస్టార్ట్.. సెట్స్‌లో పవర్ స్టార్.. ట్విట్టర్‌లో ట్రెండింగ్

by  |
Pavan-Kalyan
X

దిశ, సినిమా: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా వస్తున్న చిత్రాన్ని సాగర్ కే చంద్ర డైరెక్షన్ చేస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌కు ముందు 50శాతం కంప్లీట్ అయిన సినిమా షూటింగ్.. సోమవారం హైదరాబాద్‌లో రీస్టార్ట్ కాగా, లీడ్ యాక్టర్స్‌‌పై చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో #PSPKRanaMovie హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ కనిపించనుంది. ఒరిజినల్ మూవీలో నటించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సముద్రఖని కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి పవన్ ఫ్రెండ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా.. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు మేకర్స్.


Next Story

Most Viewed