ఘనంగా గాంధీ జయంతి

by  |

దిశ ప్రతినిధి , హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. పలు పార్టీల కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ,ఉద్యోగ సంఘాల కార్యాలయాలు , రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తదితర చోట్ల జాతిపిత చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం సమరంలో ఆయన పోషించిన పాత్ర, అహింసా మార్గంలో చూపిన దారి నేడు అందరికీ ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. నేటి యువత గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

బాపూ ఘాట్ వద్ద….

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్ హౌస్ లోని బాపూఘాట్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని బాపు సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ముందుగా బాపూఘాట్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ ఆ వెంటనే వచ్చిన గవర్నర్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం వారిరువురు కలిసి బాపూజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ,మండలి ఛీప్ విప్ బొడకంటి వెంకటేశ్వర్లు , ఎంపీలు కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి , జీఏడి (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీ అదర్ సిన్హా , జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.


Next Story