నారా లోకేశ్ తరపున బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారం.. కీలక హామీలు

by srinivas |
నారా లోకేశ్ తరపున బ్రాహ్మిణి ఎన్నికల ప్రచారం.. కీలక హామీలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిం నారా లోకేశ్ గెలుపుకోసం భార్య నారా బ్రాహ్మిణి రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆమె సోమవారం మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. నారా లోకేశ్ మంగళగిరిలో గెలిస్తే చాలా అభివృద్ధి పనులు చేస్తారని తెలిపారు. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు అందజేస్తామని నారా బ్రాహ్మిణి హామీ ఇచ్చారు. లోకేశ్ మాటల మనిషి కాదని, చేతల మనిషి అని వ్యాఖ్యానించారు. మంగళగిరికి మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే లోకేశ్ విజన్ అని తెలిపారు. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళా సాధికారితే ఆయన లక్ష్యమని చెప్పారు. కేవలం నారా లోకేశ్ సపోర్టు వల్లే తాను చాలా సేవలు చేయగలుతున్నానన్నారు. మంగళగిరి మహిళలకు కూడా నారా లోకేశ్ సపోర్ట్ చేస్తారని నారా బ్రాహ్మిణి పేర్కొన్నారు.

Next Story

Most Viewed