ప్రమోషన్స్‌లో బీటౌన్ ‘చాలెంజ్’ ట్రెండ్

by  |
ప్రమోషన్స్‌లో బీటౌన్ ‘చాలెంజ్’ ట్రెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీ యూత్‌ను రీచ్ అయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతుంది. ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే స్పెషల్ ఈవెంట్స్, మీడియా మీటింగ్స్, ఫ్యాన్స్, ఆడియన్స్‌తో చిట్‌చాట్‌ ప్లాన్ చేయడం, పాపులర్ షోస్‌‌కు గెస్ట్‌గా వెళ్లడం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. ట్విట్టర్, ఇన్‌స్టా్గ్రామ్, ఫేస్ బుక్ లాంటి ఎకౌంట్స్‌లో స్టార్స్‌కు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే వారిని టార్గెట్ చేస్తూ న్యూ స్టైల్‌లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రిలీజ్ కాబోయే సినిమాల్లో హిట్ సాంగ్స్‌ను సెలెక్ట్ చేసుకుని ఆ పేరుతో చాలెంజ్‌లు విసురుతున్నారు. ఈ క్రమంలో ఆడియన్స్ ఆ సాంగ్స్‌పై స్టెప్స్ వేసిన, రాప్ చేసిన వీడియోలు సెండ్ చేస్తే.. వాటిలో బెస్ట్ ఎంచుకుని స్టార్స్ తమ హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. సెలెబ్రిటీల ట్విట్టర్, ఇన్‌స్టా స్టోరీస్‌లో చాన్స్ కొట్టేయడం అంటే అభిమానులకు కిక్ ఇచ్చే విషయం కాబట్టి ఆ చాలెంజ్ స్వీకరించి ప్రమోషన్స్‌లో భాగం అవుతున్నారు ఫ్యాన్స్. ఇలా ప్రమోషన్స్‌లోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బాలీవుడ్.. సినిమాను హిట్ ట్రాక్‌లోకి తీసుకెళ్తోంది.

#TheBalaChallenge (ద బాలా చాలెంజ్)

నయా ట్రెండ్ ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన ద బాలా చాలెంజ్(#TheBalaChallenge) సూపర్ సక్సెస్ అయింది. కామెడీ ఫ్రాంచైజ్ ‘హౌజ్‌ఫుల్4’లో బాలా క్యారెక్టర్ ప్లే చేశారు కిలాడి అక్షయ్ కుమార్. సినిమాలో తన రోల్‌ను ప్రజెంట్ చేస్తూ రిలీజైన బాలా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే సాంగ్‌ను ప్రమోషన్స్‌కు వాడుతూ చాలెంజ్ విసిరింది మూవీ యూనిట్. సెలెబ్రిటీలు కూడా ‘ద బాలా చాలెంజ్‌’లో భాగం కాగా, రీసెంట్‌గా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ చేసిన పర్ఫార్మెన్స్ స్పెషల్ కాంప్లిమెంట్స్ అందుకుంది.

#HudHudDabanggChallenge

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దబాంగ్ 3’లో పాపులర్ సాంగ్ అయిన ‘హుడ్ దబంగ్’ సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన ఇదే పాటను ప్రమోషన్స్‌‌కు వాడింది మూవీ యూనిట్. సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ స్టెప్స్‌తో ‘హుడ్ హుడ్ దబాంగ్’ చాలెంజ్ విసిరింది. ఆటోమేటిక్‌గా ఆడియన్స్ నుంచి బిగ్ రెస్పాన్స్ రావడం, సినిమా హిట్ కావడం జరిగిపోయింది.

#CareNiKardaRapChallenge

ఈ మధ్య రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హిందీ సినిమాల్లో ‘చలాంగ్’ ఒకటి. రాజ్ కుమార్ రావు, నుశ్రత్ భరుచ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కూడా సోషల్ మీడియా ప్రమోషన్స్‌లో సూపర్ సక్సెస్ అయింది. హన్సల్ మెహతా డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాకు ‘యో యో హనీ సింగ్’ అందించిన కేర్ ని కర్దా సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ‘కేర్ నీ కర్దా రాప్’ చాలెంజ్‌తో ఈ మూవీ ప్రేక్షకులకు చేరువైంది. అర్జున్ కపూర్, రకుల్, విక్కీ కౌశల్, స్వరా భాస్కర్ లాంటి స్టార్స్ రాప్ చాలెంజ్‌ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు.

#HaseenaPaagalDiwani

లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఇందూ కీ జవానీ’. ప్రజెంట్ జనరేషన్‌పై డేట్ యాప్స్ ప్రభావం, దాని వల్ల ఎదుర్కొనే పరిణామాలు బేస్ చేసుకుని వస్తున్న ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా కనిపించనున్న కియారా.. హసీనా పాగల్ దివానీ పాటకు గ్రేస్‌ఫుల్ మూమెంట్స్‌తో అదరగొట్టేసింది. కియారా మూమెంట్స్‌కు యూత్ ఫిదా కాగా, సాంగ్ మస్త్ పాపులర్ అయింది. దీంతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే పాట (#HaseenaPaagalDiwani )ను ప్రమోషన్స్‌కు యూజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఈ చాలెంజ్ ద్వారా ‘ఇందూ కీ జవానీ’ సినిమా సోషల్ మీడియాలో ఇప్పటికే పాపులర్ కాగా.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తుంది ఇందు.

#Teribhabhichallenge

వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కూలీ నెం.1’. గోవింద, కరిష్మా కపూర్ జంటగా 1997లో వచ్చిన కూలీ నెం.1కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. వీటిలో ‘తేరి బాబి’ సాంగ్ ఒకటి కాగా.. ఈ పాటను ప్రమోషన్స్‌కు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘తేరి బాబి చాలెంజ్’ తీసుకొచ్చారు. వరుణ్, సారా మూమెంట్స్ విడుదల చేసిన మేకర్స్ బీటౌన్ ఆడియన్స్‌కు చాలెంజ్ విసురుతూ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.


Next Story

Most Viewed