చేనేతలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి

by  |
చేనేతలకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి
X

దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. కరోనా మహమ్మారితో చేనేత కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు.

చేనేత కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నా.. చేనేత కార్మికుల కోసం వెయ్యి కోట్లు కేటాయించడానికి వెనకాడుతుందని విమర్శించారు. చేనేత కార్మికుల దగ్గర నిల్వ ఉన్న వస్త్రాలను వెంటనే కొనుగోలు చేయాలని, ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 15 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో పద్మశాలి కార్మిక సంఘం అధ్యక్షుడు సురపల్లి భాస్కర్, గుర్రం బాలరాజు, గంజి అశోక్, మణిపురి దాసు, పగిడిమర్రి విష్ణు, సోలాపూర్ మల్లికార్జున్, గంజి రాజేష్, దోర్నాల రవి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed