ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్లు

by  |
ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్లు
X

దిశ,ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈనెల 3న నోటిషికేషన్ విడుదలైంది. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమైంది. ఈనెల 3న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఇకపోతే గ్రామ పంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ కాగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 8వరకు ఉంది. ఇకపోతే పరిషత్‌ ఎన్నికల విషయానికి వస్తే ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఎన్నికల నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇకపోతే నెల్లూరు కార్పొరేషన్, కుప్పం మున్సిపాలిటీపైనే అందరి దృష్టి నెలకొంది. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే నెల్లూరు కార్పొరేషన్‌ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.

పోలింగ్ వివరాలు

ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. అయితే ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న కౌంటింగ్‌ జరగనుంది. ఈ నెల 16న పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్‌ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed