ప్రియా ప్రకాశ్‌ను పడేసిన నితిన్

by  |
ప్రియా ప్రకాశ్‌ను పడేసిన నితిన్
X

దిశ, సినిమా: వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్ ‘చెక్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో నితిన్ హీరో కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ పిక్చర్స్ అండ్ వీడియో షేర్ చేసింది ప్రియ. పాట చిత్రీకరణలో భాగంగా ప్రియ పరుగెత్తుకుంటూ వచ్చి నితిన్ మీదకు ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేక ఈ సీన్ చేసే క్రమంలో కింద పడిపోయింది. దీంతో మూవీ యూనిట్ కంగారుపడిపోగా.. నవ్వుతూ పైకిలేచిన ప్రియ, తను బాగానే ఉన్నట్లు చెప్పడంతో మళ్లీ రీషూట్ చేశారు. కాగా ఈ వీడియో షేర్ చేసిన మలయాళీ భామ.. ‘జీవితంలో కిందపడిన ప్రతీసారి ఇలాగే ఆత్మవిశ్వాసంతో లేచి ముందుకు సాగుతాను’ అని తెలిపింది.

Next Story

Most Viewed