- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచానికి భారత్ దారి చూపిస్తోంది : మోదీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచానికి భారత్ దారి చూపిస్తోందని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 ని పురస్కరించుకొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకుంటోందని తెలిపారు. ప్రపంచ దేశాలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధిలోకి తీసుకురావడంలో భారత్ పాత్ర కీలకంగా మారిందని చెప్పుకొచ్చారు. ఎన్నో దశాబ్దాలుగా మన దేశానికి చెందిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచానికి భారత్ దారి చూపిస్తోందని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 ని పురస్కరించుకొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం పుంజుకుంటోందని తెలిపారు. ప్రపంచ దేశాలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధిలోకి తీసుకురావడంలో భారత్ పాత్ర కీలకంగా మారిందని చెప్పుకొచ్చారు. ఎన్నో దశాబ్దాలుగా మన దేశానికి చెందిన టెక్కీలు విశ్వానికి మార్గం చూపిస్తున్నారని వెల్లడించారు. కరోనాపై పోరాడుతూనే అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపైన దృష్టి సారించామని ప్రధాని స్పష్టం చేశారు.
Next Story






