2008 ఏప్రిల్ 14 అర్ధరాత్రి షబ్నం కుటుంబ సభ్యుల్ని ఎలా చంపింది

by  |
2008 ఏప్రిల్ 14 అర్ధరాత్రి షబ్నం కుటుంబ సభ్యుల్ని ఎలా చంపింది
X

దిశ,వెబ్‌డెస్క్: డియర్ ప్రెసిడెంట్ అంకుల్ మా అమ్మకు క్షమాభిక్ష పెట్టండి. ఇది ఓ సగటు భారతీయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పెట్టుకున్న పిటిషన్. తొలిసారి ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న మహిళకు క్షమాభిక్ష పెడతారా లేదా అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది.

మీకు తెలిసిన 10మంది మంచి వాళ్ల పేర్లు చెప్పమంటే తడుముకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో. మంచితనం ఎక్కడుందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. అప్పటిదాకా ఆప్తుల్లా ఉన్నవాళ్లే.. అప్పటికప్పుడు శత్రువుల్లా మారి అరాచకాలకు పాల్పడుతున్నారు. దారుణమైన నేరాలకు ఒడిగడుతున్నారు. అందరిలో నేర స్వభావం ఉంటుంది. దాన్ని అణిచి వేసి మనిషిగా బ్రతకడమే గొప్పతనం. కానీ తెలిసో తెలియకో ఆవేశంలో ఓ నేరం చేశామంటే దానికో అర్ధం ఉంది. కానీ కావాలని క్రైమ్ చేసి దాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించడం, పోలీసుల్ని పక్కదారి పట్టించడం లాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ మిస్టరీ కేసులు విసురుతున్న సవాళ్లను అంతే ధీటుగా ఎదుర్కొంటున్న పోలీసులు నిందితుల్ని ఉరికంబం ఎక్కిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో అమ్రోహా ప్రాంతంలోని హసన్ పూర్ పట్టణానికి సమీపంలో భావన్ కేడీ సమీపంలో 2008 ఏప్రిల్ 14న దారుణం జరిగింది. అర్ధరాత్రి ఏడుగురు కుటుంబసభ్యులు దారుణం హత్యకు గురయ్యారు. వారిని హతమార్చింది ఎవరో కాదు ఇంట్లో సభ్యురాలైన షబ్నం. షబ్నం, అలీలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అప్పటికే గర్భవతైన షబ్నం కుటుంబ సభ్యుల అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. కుట్రప్రకారం కుటుంబ సభ్యులకు పాలల్లో మత్తు పదార్ధం కలిపి ప్రియుడు సలీంతో కలిసి గొడ్డలితో విచక్షణా రహితంగా నరికేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసులో ఆ కుటుంబానికి చెందిన షబ్నం, ఆమె ప్రియుడు సలీంతో కలిసి ఈ హత్యలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ఘటనలో ఆమె మాస్టర్ షౌకత్, తల్లి షస్మి, సోదరులు అనీష్, రహిత్, సోదరి రబియా,వదిన అంజూమ్ తో పాటు అల్లుడు పదినెలల పసిగుడ్డు చిన్నారి హార్ష్ ను గొంతు నులిమి చంపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై అమ్రొహ కోర్ట్ లో 2ఏళ్ల 3నెలల పాటు విచారణ సాగింది. ఈ కేసులో న్యాయమూర్తి 29మంది సాక్ష్యుల వాంగ్మాూలాన్ని విన్నారు. ఈ కేసులో 29మంది సాక్షలు 649 ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వాంటన్నింటిని పరిశీలించిన తర్వాత షబ్నమ్, సలీంలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు జులై 10,2010న న్యాయమూర్తి నిర్ధారించారు. మరునాడు అంటే 2010జులై 15న కేవలం 29 సెకన్లలో షబ్నమ్, ఆమె ప్రియుడు సలీంకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. తీర్పును 160పేజీల్లో న్యాయమూర్తి వెల్లడించారు. ఆమెను బరేలీ జైలుకు తరలించారు. సలీంను ఆగ్రాజైలుకు తరలించారు. అయితే కింది కోర్ట్ అమ్రొహ కోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ షబ్నమ్, ఆమె ప్రియుడు సలీంలు 2015లో సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించారు. అయితే అమ్రొహా కోర్ట్ తీర్పును దేశ అత్యున్నత న్యాయ స్థానం సమర్ధించింది. చివరాకరుగా రాష్ట్రపతి క్షమాభిక్షకు ధరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వారి ధరఖాస్తున్న రాష్ట్రపతి తోసి పుచ్చారు. తమ ప్రేమకు అడ్డొస్తున్నారంటూ కుటుంబసభ్యుల్ని హతమార్చిన ఆమెకు క్షమాభిక్ష ఇవ్వలేమంటూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. దీంతో వారికి ఉరిఖాయమైంది. దారులు మూసుకుపోయాయి. ఆ మేరకు ఉరికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బరేలీ జైలు అధికారులు తెలిపారు.

150ఏళ్ల మధుర జైల్లో ఉరి

ఉత్తర ప్రదేశ్ మధురలో మహిళల్ని ఉరితీసేందుకు 1970లో బ్రిటీష్ పరిపాలనలో ప్రత్యేక జైలును నిర్మించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటి వరకూ మహిళా ఖైదీలను ఉరితీయలేదు. తొలిసారి ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షబ్నంమ్ ను 150ఏళ్ల మధుర జైల్లో ఉరితీయనున్నారు. ఆమెను ఉరితీసేందుకు ఉరితాడును సిద్ధం చేస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. త్వరలో షబ్నమ్, ఆమె ప్రియుడు సలీంను ఉరితీసేందుకు డెత్ వారెంట్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికి వారిని ఉరితీసే తేదీ ఖరారు కాలేదని, కానీ ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జైలు సూపరిటెండెంట్ తెలిపారు.

ఇప్పటివరకు 35మందిని ఉరికంబం ఎక్కించారు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆగ్రజైలులో 35మందిని ఉరికంబమెక్కించారు. 1959లో 10మంది ఖైదీలను ఉరితీయగా 1984లో చివరి సారిగా ఆగ్రజైలులో ఉరితీత జరిగింది. బాలికను రేప్ చేసే చంపేసిన బులంద్ షహర్ కు చెందిన జమాన్ ఖాన్ ను ఉరితీశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆగ్రజైలులో ఒక్కరిని ఉరితీయలేదు. దాదాపూ 40 ఏళ్ల అనంతరం సలీంను బలిపీఠం ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దేశంలో 150ఏళ్ల తరువాత మహిళను ఉరికంబం ఎక్కించేందుకు మధుర జైలు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసిన పవన్‌ జల్లాదేనే

షబ్నమ్‌ కొడుకు తన తల్లిని ఉరి తీయ్యొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభ్యర్థించాడు. ఈ మేరకు రాష్ట్రపతికి ఎదుట క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశాడు. షబ్నమ్‌ కొడుకు నేపథ్యంలో మహ్మద్‌ తాజ్ రామ్‌పుర్‌ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తీవ్ర ఆవేదను లోనైయ్యాడు. ఇప్పటికే గవర్నర్‌ అనందిబెన్‌ పటేల్‌ షబ్నమ్‌ కేసుకు సంబంధించిన క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించారు. దీంతో ఆమెను ఉరి తీయడానికి మధుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసిన పవన్‌ జల్లాదేనే షబ్నమ్‌నూ కూడా ఉరి తీసే అవకాశం ఉంది.



Next Story

Most Viewed