ఈ నెలాఖరులోగా తేల్చండి.. లేదా తాడోపేడో తేల్చుకుంటాం..

by  |
SRINIVAS AP
X

దిశ, ఏపీ బ్యూరో : నవంబర్ నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. గుంటూరులో సోమవారం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో ఉద్యోగస్తులు, పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అలాగే ఆసుపత్రికి వెళ్లేందుకు హెల్త్‌ కార్డులు కూడా లేని దుస్థితి ఉద్యోగస్థులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోట్లాది రూపాయల వైద్య బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. పీఆర్సీ అంశంపై ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

అక్టోబర్ నెలలోనే పీఆర్సీ అమలు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పుకొచ్చారని.. కానీ ఇప్పటికీ అది నెరవేరలేదన్నారు. తమకు పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు హెచ్చరించారు.


Next Story